logo

ఈ రోడ్డుపై సాహసం చేయాల్సిందే

వైకాపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న కాలనీల్లో భాగంగా మండలంలోని అర్తమూరులో 150 ఫ్లాట్లతో లేఔట్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు కేటాయించారు.

Published : 27 Mar 2023 05:06 IST

అర్తమూరులోని జగనన్న కాలనీకి వెళ్లే మట్టి రోడ్డు

వైకాపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న కాలనీల్లో భాగంగా మండలంలోని అర్తమూరులో 150 ఫ్లాట్లతో లేఔట్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు కేటాయించారు. కాలనీ ఏర్పడి రెండేళ్లయినా పూర్తి స్థాయిలో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలు మొగ్గు చూపడం లేదు. ఇప్పటి వరకు 150కి సుమారు 20 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో ఉండే ఈ కాలనీకి వెళ్లేందుకు మట్టి రోడ్డు కావడంతో ప్రజలు సుముఖత చూపించడం లేదు. విద్యుత్తు, కుళాయిల సదుపాయం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించి అంతర్గత, ప్రధాన రోడ్లను నిర్మించాలని కోరుతున్నారు.

అర్తమూరు (బంటుమిల్లి), న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని