logo

Somu Veerraju: వైకాపా రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. ప్రజలను మేం ఆదుకుంటున్నాం: సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదని పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఎవరో రాసిస్తే చదివే అలవాటు లేదన్నారు.

Updated : 11 Jun 2023 19:50 IST

అమరావతి: భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదని పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తారని సోము వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఎవరో రాసిస్తే చదివే అలవాటు లేదన్నారు.  శనివారం శ్రీకాళహస్తి సభలో మాట్లాడిన జేపీ నడ్డా.. వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. నడ్డా విమర్శలపై పలువురు వైకాపా నేతలు కౌంటర్‌ ఇవ్వడంపై సోము తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘ఒక్క విశాఖ జిల్లాలోనే రూ.150 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగింది. లిక్కర్ మాఫియా జోరు మీద ఉంది. ఏళ్లుగా ఇసుక దోపిడీ జరుగుతోంది. 9 ఏళ్ల మోదీ పాలనపై ఎవరొచ్చినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. వైకాపా రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. భాజపా ప్రజలను ఆదుకుంటోంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. పేర్ని నాని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఈ నాలుగేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయ్యలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉరుకోం’’ అని సోము హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు