logo

Perni Nani: ద్వారకా తిరుమలలో మాజీ మంత్రి పేర్ని నాని వింత ప్రవర్తన

మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని నిత్యం తన మాటలు, ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా మరోసారి ఆయన ప్రవర్తన వైకాపా శ్రేణులు, అభిమానులకు వింతగా అనిపించింది.

Updated : 25 Sep 2023 09:02 IST

శేష వస్త్రం కప్పుతుండగా అడ్డుకుంటూ..

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని నిత్యం తన మాటలు, ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా మరోసారి ఆయన ప్రవర్తన వైకాపా శ్రేణులు, అభిమానులకు వింతగా అనిపించింది. నాని సతీసమేతంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వేంకన్నను ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి, శేష వస్త్రం కప్పుతుండగా నాని అభ్యంతరం తెలిపారు. ఆలయ సంప్రదాయాన్ని కాదని తానే స్వయంగా శేష వస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు. దీంతో ఆలయ అధికారులు, అర్చకులు అవాక్కయారు. అభిమానంతో ఆయన్ని కలవడానికి ఆలయం వద్దకు వచ్చిన వైకాపా నాయకులతో సైతం వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రశాంతంగా స్వామి వారి దర్శనానికి వస్తే.. విహారయాత్ర, వివాహానికి వచ్చినట్లు ఇంత మంది ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పుట్టిన రోజుకి మాజీ ఎమ్మెల్యే హోదాలో తన ఆశీర్వాదం పంపుతానని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో తాను ఉండబోనని నాని మరోసారి స్పష్టం చేసినట్లయ్యింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని