logo

నిబంధనలు బేఖాతర్‌

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 06 May 2024 04:20 IST

చిన ఓగిరాల(ఉయ్యూరుగ్రామీణం, న్యూస్‌టుడే): ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌ ఫ్లెక్సీలను ఉయ్యూరు మండలం చిన ఓగిరాల వంతెన సమీపంలోను, గ్రామంలోనూ ఏర్పాటు చేశారు. కరెంట్‌ స్తంభానికి కూడా కట్టడం గమనార్హం. అయినా అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని