logo
Published : 27/11/2021 04:13 IST

మద్దతు ధరల చట్టం సాధించే వరకు ఉద్యమం

రైతు, కార్మిక సంఘాల నాయకుల ప్రదర్శన

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: మద్దతు ధరల చట్టం కొనసాగించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని ధర్నాచౌక్‌లో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమతి ఆధ్వర్యంలో రైతు ఉద్యమ వార్షికోత్సవం సత్యాగ్రహ దీక్షలను నిర్వహించారు. కార్యక్రమానికి ముందు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ధర్నాచౌక్‌ వరకు ఆట-పాట-మాట, డప్పులు, కోలాటం, కొమ్ముల శంఖారావం, రైతుల గేయాలు, నృత్యాలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే మాట్లాడుతూ... విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని చెప్పారు. కార్మిక వర్గం, ఇతర ప్రజా సంఘాలు ఇచ్చిన తోడ్పాటు వల్లే మోదీ మెడలు వంచగలిగామన్నారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీఐటీయూ రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు గిరీష్‌, ఇతర రైతు సంఘాల నాయకులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌ నుంచి అలంకార్‌ సెంటర్‌ వరకు ట్రాక్టర్లు, ఆటోలతో  ర్యాలీ

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని