logo
Updated : 29/11/2021 05:48 IST

న్యూ మోంక్స్‌ కుంగ్‌ఫూ నూతన కమిటీలు


జిల్లా, విజయవాడ అర్బన్‌ న్యూ మోంక్స్‌ కుంగ్‌-ఫూ నూతన కమిటీ సభ్యులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యూ మోంక్స్‌ కుంగ్‌-ఫూ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్‌ న్యూ మోంక్స్‌ కుంగ్‌ఫూ నూతన కమిటీలను ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ చెన్నంశెట్టి చక్రపాణి ప్రకటించారు. జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఏవీ రమణ, ప్రధాన కార్యదర్శిగా బర్రె శ్రీనివాసరావు, కోశాధికారిగా వి.వివేకానందమూర్తి, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా అడపా నాగశ్రీ (కంకిపాడు), ప్రధాన కార్యదర్శిగా తాడివాక మహాలక్ష్మి (ఉయ్యూరు), న్యాయ సలహాదారులుగా సీహెచ్‌ యాడమ్‌కుమార్‌, ఎన్‌.జ్యోతి, జి.చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. విజయవాడ అర్బన్‌ కమిటీ అధ్యక్షుడిగా సీహెచ్‌ సాయిరాం (విజయవాడ), ప్రధాన కార్యదర్శిగా పిళ్లా శ్రీనివాస్‌ (విజయవాడ), కోశాధికారిగా జి.ఉత్తమ నాగరాజు (విజయవాడ), మహిళా కమిటీ అధ్యక్షురాలిగా చెలమలశెట్టి పద్మజ (విజయవాడ), న్యాయ సలహాదారులుగా జి.గంగాధర్‌, మట్టా వరప్రసాద్‌, ఎస్‌.నాగలక్ష్మి (విజయవాడ)లు ఎన్నికయ్యారు. రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షుడిగా రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్‌, ఉపాధ్యక్షునిగా బెజవాడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పిళ్లా రవి, సలహాదారుగా నరహరిశెట్టి శ్రీహరిలను నియమించామన్నారు. జాతీయ న్యూ మోంక్స్‌ కుంగ్‌-ఫూ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకుడు గ్రాండ్‌ మాస్టర్‌ ఎంఎన్‌ రవికుమార్‌ (చెన్నై), రాష్ట్ర చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ జీవీ రాఘవ (ఏలూరు), రాష్ట్ర సంఘం న్యాయ సలహాదారు బి.వివేకానందమూర్తి, కర్ణాటక రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మణ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని