logo
Published : 02/12/2021 05:03 IST

స్మార్ట్‌ కార్డులకు మళ్లీ గిరాకీ

ఈనాడు - అమరావతి

స్మార్ట్‌కార్డుల ముద్రణలో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి ప్రధానంగా రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి సక్రమంగా సరఫరా కాకపోవడమే కారణం. గాడిలో పడుతుందనుకున్న సమయంలో మళ్లీ బ్రేక్‌ పడింది. ఇటీవల డీఎల్‌ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి, రెన్యూవల్స్‌కు, కొత్త వాహనాలు, యాజమాన్యం మార్పు, తదితర వాటికి మళ్లీ కార్డులు అందడం లేదు. కార్డుల సరఫరాకు మళ్లీ టెండర్లు పిలిచి, గుత్తేదారుని ఎంపిక చేయలేదు. ● జిల్లాలో గత ఏడాది ఇలాగే కొరత కారణంగా, సెప్టెంబరు నుంచి ప్రింటింగ్‌ నిలిపారు. దాదాపు 2 లక్షల వరకు ఆగిపోయాయి. ఈ ఏడాది కార్డుల కోసం టెండరు పిలవడంతో సరఫరాను పునరుద్ధరించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ వాటిని ముద్రించడం మొదలుపెట్టారు. హఠాత్తుగా మళ్లీ సరఫరా ఆగడంతో మొదటికి వచ్చింది. ప్రస్తుతం డీఎల్‌, ఆర్సీలు సుమారు 50 వేలు పైగా ఇంకా ప్రింట్‌ చేయాల్సి ఉంది. సెప్టెంబరు నెలాఖరు వరకు ఉన్న వాటిని పూర్తి చేశారు. కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టిన తర్వాత స్లాట్ల కోసం విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. దీంతో వీటి సంఖ్యను అధికారులు పెంచారు.

● తనిఖీల సమయంలో వీటికి బదులు సాఫ్ట్‌కాపీలను చూపించమని అధికారులు సూచిస్తున్నా పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జారీ అయిన డీఎల్‌, ఆర్సీలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. వీటిని వాహనదారులు తమ లాగిన్‌లోకి వెళ్లి ప్రింట్‌ తీసుకోమని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి కార్డులను అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి జారీకి ఉపయోగిస్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని