Published : 06 Dec 2021 21:14 IST
Ap News: ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అమరావతి: ఉద్యోగుల బదిలీలపై పాక్షికంగా ఉన్న నిషేధాన్ని ఏపీ సర్కార్ సడలించింది. వచ్చే నెల 4 వరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పరస్పర అంగీకార బదిలీలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం సడలించింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఓకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే పరస్పర బదిలీలకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. బదిలీ కోరుకొనే ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ కేసులు, ఇతర అభియోగాలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags :