logo

కౌలు రైతు ఆత్మహత్య

మండలంలోని సౌపాడులో కౌలు రైతు పల్లపు అంకమ్మరావు (39) అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుంటూరులో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. ఇన్‌ఛార్జి

Published : 22 Jan 2022 03:34 IST

సౌపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: మండలంలోని సౌపాడులో కౌలు రైతు పల్లపు అంకమ్మరావు (39) అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుంటూరులో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. ఇన్‌ఛార్జి ఎస్సై కోటేశ్వరరావు కథనం.. అంకమ్మరావు 3.5 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి వేశారు. తెగుళ్లతో పంట దిగుబడి రాకపోగా, వ్యవసాయానికి చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరాయి. వాటిని ఎలా తీర్చాలన్న బెంగతో గురువారం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరారు. గమనించిన భార్య పార్వతి ఆయనను  గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

అనుమానాస్పద స్థితిలో అన్నదాత మృతి

మేడికొండూరు: పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన అన్నదాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం బయటపడింది. పోలీసుల కథనం మేరకు.. ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెం గ్రామానికి చెందిన రైతు మట్టుపల్లి మనోహర్‌ (62) గురువారం రాత్రి తన మిరప పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం పాలడుగు అడ్డరోడ్డు సమీపంలో నోటి నుంచి నురగ కారుతూ పడి ఉన్నారు. స్థానికులు పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. మనోహర్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.  అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని