logo
Published : 02/12/2021 06:13 IST

ఆర్డీటీకి జపాన్‌ వైద్య పరికరాల అందజేత

పరికరాలను ఆవిష్కరిస్తున్న తాగ మసయుకి,

ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌

బత్తలపల్లి న్యూస్‌టుడే : పేదలకు మెరుగైన వైద్యం అందించటంలో ఆర్డీటీ సంస్థ చేస్తున్న కృషి అనిర్వచనీయమని చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ సభ్యులు ఒడగావ హజిమి, తాగమసయుకి పేర్కొన్నారు. బుధవారం జపాన్‌ ప్రభుత్వం తరఫున బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి రూ.61,61,732 విలువైన 49 రకాల వైద్య పరికరాలను అందించి, వాటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు తమ వంతు సాయంగా పరికరాలను అందించామన్నారు. ఈ పరికరాల ద్వారా మరింత మెరుగైన వైద్యం అందించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను ఆదుకునే ప్రాజెక్టు నిధుల కింద అందజేసినట్లు వివరించారు. ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ మాట్లాడుతూ ఆర్డీటీ ఆసుపత్రిలో తక్కువ ధరలకే పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడాన్ని గుర్తించిన జపాన్‌ ప్రభుత్వం వైద్య పరికరాలను అందించిందని, ఆనందం వ్యక్తం చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్‌ డైరెక్టర్‌ పాల్‌, హెచ్‌వోడీ శర్మ, డైరెక్టర్‌ నాగప్ప, సాగర్‌మూర్తి, హనుమంతరెడ్డి, సూపరింటెండెంట్‌ జ్యోతి, వైద్యులు హరీష్‌, వెంకటరమణ, గంగాధర్‌రెడ్డి, రఘుప్రకాష్‌రెడ్డి, కన్నన్‌, నజీర్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ శాంతి, కిషోర్‌, మేనేజర్‌ పవన్‌కుమార్‌, హరిత తదితరులు పాల్గొన్నారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని