logo

మధ్యాహ్న భోజనం నిర్వహణపై ఆరా

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం ఉమ్మడి జిల్లాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు.

Published : 03 Dec 2022 02:35 IST

పాపంపేటలో విద్యార్థులతో కలిసి భోజనం తింటున్న అధికారులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం ఉమ్మడి జిల్లాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతపురం జిల్లాలో అనంతపురం రూరల్‌లోని పాపంపేట, రాయదుర్గం మండలంలో ఆవులదట్ల, శ్రీసత్యసాయి జిల్లాలో చిలమత్తూరు మండలం కొడికొండ, కదిరి మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆవులదట్లలో శుక్రవారం గుడ్లు పంపిణీ చేయలేదు. తనిఖీ చేసిన ఈ నాలుగు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఉన్నతాధికారులెవరూ తనిఖీలు చేయనట్లు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వంట మనుషులు, సహాయకులు లేనట్లు గమనించారు. తనిఖీల్లో ఐవోపీలు సాయిప్రసాద్‌, రామారావు, వెంకటరమణ, డీఈఈ యోగేష్‌బాబు, ఎస్సై ఫణీంద్రనాథ్‌రెడ్డి, ఏవో వాసుప్రకాష్‌, ఏజీ శివప్రసాద్‌, ఏఈఈ రవీంద్రనాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని