logo

టీచర్ల సమస్యలన్నీ అపరిష్కృతమే

‘ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి టీచర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా తీర్చలేదు. సరికదా... కోర్కెలు తగ్గించుకోవాలని మంత్రులు, సలహాదారులు చెబుతున్నారు.

Published : 08 Dec 2022 04:34 IST

ధర్నాలో నినాదాలు చేస్తున్న ఎస్టీయూ నాయకులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి టీచర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా తీర్చలేదు. సరికదా... కోర్కెలు తగ్గించుకోవాలని మంత్రులు, సలహాదారులు చెబుతున్నారు. నెల జీతం కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. మున్ముందు జీతం కూడా కోరికలా భావిస్తారేమో..’ అని ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నేతలు విమర్శించారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో అనంత కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్యుడు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ టీచర్ల పట్ల నియంతృత్వ, అప్రజాస్వామిక వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. డీఏ, పీఎఫ్‌, జీఎల్‌ఐ రుణాలు, సంపాదిత సెలవు నగదు, వైద్య బిల్లు, పీఆర్‌సీ బకాయిలు.. ఇలా ప్రతీదీ పెండింగే. ప్రతినెలా ఒకటో తేదీ జీతం ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. సత్వరమే సమస్యలన్నీ పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రస్థాయి ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు సూర్యనారాయణ గౌడ్‌, ప్రసాద్‌, రామాంజనేయులు, వన్నూర్‌, రవి, రాజశేఖర్‌, ఓబలేశు తదితరులు పాల్గొన్నారు. డీఆర్‌ఓ గాయత్రీదేవికి వినతి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని