logo

జలకళ ఏదీ జగన్‌?

జలకళ పథకాన్ని సీఎం జగన్‌ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు.

Published : 28 Mar 2024 05:11 IST

నామమాత్రంగా బోర్ల తవ్వకాలు
నిధుల్లేక పడకేసిన పథకం
అనంతపురం (లక్ష్మీనగర్‌), పుట్టపర్తి, న్యూస్‌టుడే

లకళ పథకాన్ని సీఎం జగన్‌ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు. ఏడాదికి వంద బోర్లు మాత్రమే తవ్విస్తామన్నారు.. ఈక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావటంతో మళ్లీ మాట మార్చి నియోజకవర్గానికి ఏడాదికి 500 బోర్లు మంజూరు చేస్తూ అనుమతి ఇచ్చారు. బోరు తవ్వించుకున్న రైతు పొలానికి ఉచితంగా విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పించటంతోపాటు మోటారు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కొద్దికాలానికి కరెంటు సర్వీసుకు అయ్యే మొత్తం రూ.2 లక్షల వరకే ఇస్తాం.. మిగిలింది రైతులే చెల్లించి కనెక్షన్‌ పొందాలి అంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అంతా చెల్లించాల్సిందే..

మళ్లీ కొన్ని నెలలకే కనెక్షన్‌ ఇప్పించలేం.. మొత్తం రైతులే చెల్లించాలని వైకాపా సర్కారు పేర్కొంది. ఈనేపథ్యంలో ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో దరఖాస్తులు భారీగా వచ్చినా బోర్ల తవ్వకాలు నామమాత్రంగానే జరిగాయి. గుత్తేదారులకు నిధులు విడుదల చేయకపోవటంతో వారు ఆరునెలల క్రితమే తవ్వకాలను నిలిపివేశారు. బకాయిలు విడుదల చేస్తే తప్ప తాము బోర్లు తవ్వలేం.. ఇప్పటికే అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు, విద్యుత్తు కనెక్షన్‌, మోటారు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన అన్నదాతలు... ఎన్నిసార్లు మాట మార్చి... మడమ తిప్పుతారంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


విద్యుత్తు కనెక్షన్లు కొన్నింటికే...

థకం కింద బోరు తవ్వించుకున్న రైతులు విద్యుత్తు కనెక్షన్‌ పొందేందుకు 1,251 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా 201 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. బోర్లు తవ్వించుకున్న పలువురు రైతులు విద్యుత్తు కనెక్షన్‌ పొందడానికి డబ్బులు లేక నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని