logo

ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు

తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు.

Updated : 28 Mar 2024 06:29 IST

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. ఉదయం 9.55 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. ప్రసన్ననాయపల్లి అయ్యప్పస్వామి దేవాలయం దగ్గర దిగి 10.45 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11.00 గంటలకు రాప్తాడు బస్టాండు కూడలికి చేరుకుంటారు. 12.30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 12.45 నుంచి 2 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి 2.20కు బుక్కరాయసముద్రం సబ్‌స్టేషన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. 2.30 నుంచి 4 వరకు బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5.10కి ప్రసన్నాయపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని ఎస్‌టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దిగుతారు. మహిళా కళాశాల కూడలిలో 5.50 నుంచి 7.30 వరకు బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం మదనపల్లి బయలుదేరి వెళతారు.


కదిరిలో ఇఫ్తార్‌ విందు

కదిరి: చంద్రబాబు కదిరికి వస్తుండటంతో గురువారం సాయంత్రం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. బుధవారం కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఇఫ్తార్‌ విందు సాయంత్రం 6.31 గంటలకు ఉంటుందన్నారు. ముస్లిం మతపెద్దలు, గురువులు, మౌలానాలు, ఇమాం, మౌజన్‌లు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ముస్లిం అభ్యున్నతికి, సంక్షేమానికి, రక్షణకు తెదేపా కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు వాహిద్‌ హుసేన్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని