logo
Published : 02/12/2021 03:47 IST

అప్పుల బాధతో తల్లీ, కుమారుడి ఆత్మహత్యాయత్నం


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బేబి, బ్రహ్మాజి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: అప్పులు తీర్చలేక తల్లీ, తనయుడు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటన పట్టణంలోని జలవినాయకుని ఆలయం వద్ద బుధవారం చోటు చేసుకుంది. తిరుపతి రాయలచెరువు రోడ్డులో పాదరక్షల దుకాణాన్ని నిర్వహిస్తున్న బేబి(60), ఆమె కుమారుడు బ్రహ్మాజి(40) అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. అప్పులు తీర్చలేక శ్రీకాళహస్తి పట్టణం జలవినాయకుని ఆలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. స్థానికుల సమాచారంతో 108 అత్యవసర సేవకులు వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని