logo

ఓటీఎస్‌కు సహకరించండి

ఓటీఎస్‌ పథకానికి సంబంధించి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని గృహనిర్మాణశాఖ జేసీ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం మండల కేంద్రంలోని సచివాలయంలో గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్‌ పథకం ద్వారా డబ్బులు

Published : 05 Dec 2021 05:59 IST

పూతలపట్టు: ఓటీఎస్‌ పథకానికి సంబంధించి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని గృహనిర్మాణశాఖ జేసీ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం మండల కేంద్రంలోని సచివాలయంలో గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్‌ పథకం ద్వారా డబ్బులు కట్టించి గృహపత్రాలు అందజేశారు. ఎంపీపీ కుమారి, జట్పీటీసీ దేవిక, తహసీల్దారు విజయభాస్కర్‌ పాల్గొన్నారు. ఐరాల: కాణిపాకం, ఎం.పైపల్లి సచివాలయాలను జేసీ(అభివృద్ధి) శ్రీధర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటీఎస్‌పై అధికారులతో సమీక్షించారు. చిత్తూరు నగరం: స్థానిక 46వ వార్డు సచివాలయాన్ని జేసీ(అభివృద్ధి) శ్రీధర్‌ తనిఖీ చేశారు. వార్డు కార్యదర్శులు, వాలంటీర్ల హాజరు పట్టికను పరిశీలించారు. సంపూర్ణ గృహహక్కు పథకం జాబితా, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, వ్యాక్సినేషన్‌ వివరాలను కార్యదర్శుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పలమనేరు: ఎరువులు, పురుగు మందులను వ్యవసాయశాఖ రైతులకు అందుబాటులో ఉంచాలని జేసీ రాజబాబు అన్నారు. పెంగరగుంట సచివాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని