logo

చింతపుండు

ఏడాది పొడవునా ఉపాధి లభించే చింత పరిశ్రమ నష్టాల ఊబిలో చిక్కుకుంది. ఏటా దేశంలోని దక్షిణ రాష్ట్రాల నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పొట్టు కాయను దిగుమతి చేసుకోవడం పరిపాటి

Published : 04 Dec 2022 03:48 IST

ఏడాది పొడవునా ఉపాధి లభించే చింత పరిశ్రమ నష్టాల ఊబిలో చిక్కుకుంది. ఏటా దేశంలోని దక్షిణ రాష్ట్రాల నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పొట్టు కాయను దిగుమతి చేసుకోవడం పరిపాటి. దిగుబడులు అధికమవడం, ఇతర ఉత్పత్తులపై దృష్టిపెట్టక పోవడంతో ఈ వ్యాపారంలో సంక్షోభం నెలకొంది. ఈ రెండేళ్లు నష్టాల బాటలో సాగడంతో రానున్న సీజన్‌లో చింత దిగుమతులకు వ్యాపారులు సుముఖత చూపడం లేదు.

న్యూస్‌టుడే, పుంగనూరు

కుంగిపోతున్న వ్యాపారులు

రైతన్నలు, వారిని నమ్ముకున్న వ్యాపారులను ఆదుకుంటూ వస్తున్న చింతపండు వ్యాపారంలో స్తబ్ధత నెలకుంది. సీజన్‌లో పోటీపడి రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం బిక్కముఖాలేస్తున్నారు. సీజన్‌లో కొనుగోలు చేసిన ధరల కంటే తక్కువ ధరలు ఉండంతో ఏడాది పొడవునా ఎగుమతులు ఊపందుకోలేదు. వ్యాపారులకు శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన బాడుగలు, పెట్టుబడులపై వడ్డీలు తడిసి మోపెడు కావడంతో వ్యాపారులు కుంగిపోతున్నారు.

కూలీలకు పని దొరక్క

సాధారణంగా సీజన్‌లో ఇక్కడ నిల్వ చేసుకుని తిరిగి అవసరాలకు అనుగుణంగా ఏడాది పొడవునా వివిధ ప్రాంతాలకు చపాతీ, పూపండు, కరిపులి రకాలుగా విభజించి ఎగుమతి చేస్తారు. దీంతో కట్టెకాయ నుంచి వివిధ రకాల పండుగా విభజించే వరకు కూలీలతో పని ఉంటోంది. ఫలితగా ఇక్కడ ఏడాది పొడవునా కూలీలకు పని దొరుకుతోంది. పుంగనూరు, పలమనేరు, మదనపల్లె ప్రాంతాల్లో సుమారు 30వేల కుటుంబాలకు చింతపండు పరిశ్రమ ఉపాధి మార్గం చూపుతోంది. ధరలు ఉంటే చింతపండు ఎగుమతులు, దిగుమతులతో కూలీలకు చేతినిండా పని దొరికేది. కొందరు వ్యాపారులు వడ్డీలు కట్టలేక, శీతల గిడ్డంగుల బాడుగలు చెల్లించలేక నష్టాల ధరలకే తెగనమ్ముకుంటున్నారు.

రూపాయికి అర్ధ రూపాయే

చింతపండు వ్యాపారంలో రూపాయి పెట్టుబడి పెట్టిన వ్యాపారులకు అర్ధ రూపాయే దక్కుతోంది. మూడు నెలలు వచ్చే ముడిసరకు ఆరు నెలలు వస్తుంటే ఎలా అమ్ముకోవాలి. పచ్చళ్లు, పొడి, జూస్‌గా తయారు చేయడం తప్ప ఇతర మార్గాలు లేవు.
-ఎంఎస్‌ సలీంబాషా, అధ్యక్షుడు, చింతపండు వ్యాపారుల సంఘం, పుంగనూరు


వరుస నష్టాలతో గోదాముల్లో  60 వేల టన్నుల నిల్వ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని