logo

27 నుంచి తిరుమలలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు

మేఘ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను సోమవారం నుంచి తిరుమలలో నడపనున్నట్లు సమాచారం.

Published : 24 Mar 2023 02:09 IST

తిరుమల, న్యూస్‌టుడే: మేఘ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను సోమవారం నుంచి తిరుమలలో నడపనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని కంపెనీలో ఎలక్ట్రిక్‌ బస్సులు సిద్ధం కాగా.. ఈ నెల మొదటి వారంలో తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం చిన్నచిన్న మార్పులు సూచించగా ప్రస్తుతం ఐదు బస్సులు తిరుపతిలోని తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. మరో ఐదు త్వరలో అందించనున్నారు. ఆదివారం సాయంత్రానికి తిరుమల ట్రాన్స్‌పోర్ట్‌ విభాగానికి చేరుకుంటాయి. సోమవారం నుంచి తిరుమలలో ఉచిత విద్యుత్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు తితిదే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. 25 సీట్ల కెపాసిటీతో పాటు మరో 25 మంది నిలబడేందుకు వీటిని సిద్ధం చేశారు. రెండు వైపుల ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు ఆటోమెటిక్‌ తలుపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుమలకు తిరుగుతున్న ఎలక్ట్రిక్‌ బస్సుల తరహాలో వీటిని తీర్చిదిద్దారు. సీసీ కెమెరాలు, అనౌన్స్‌మెంట్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలలో 12 వరకు ఉచిత ధర్మరథం బస్సులు ఉండగా.. వాటి స్థానంలో పది ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తెస్తున్నారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ధర్మరథం బస్సులు తిరుపతిలో ఉపయోగించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని