Kirankumarreddy: పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్‌కుమార్‌రెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 

Updated : 18 Apr 2024 22:27 IST

పీలేరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థిగా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఏర్పాటు చేసిన సభలో కిరణ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు అన్నీ చేశారని ధ్వజమెత్తారు. ‘‘ నియోజకవర్గ నాయకులతో కలిసి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఉన్న సమయంలో రాత్రి 11 గంటలకు వచ్చి పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు. డీసీసీ పదవి ఇప్పించాలని ప్రాథేయపడ్డాడు. తాగి వచ్చాడని నేను అనుకున్నానేమోనని మరుసటి రోజు ఉదయం మళ్లీ వచ్చి నా కాళ్లు పట్టుకున్నాడు. డీసీసీ పదవికి సహకరించలేదని అప్పటి నుంచి కసి పెంచుకున్నాడు. ఈ విషయంపై కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? రైతుల రక్తం తాగిన పెద్దిరెడ్డి ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సిద్ధంగా ఉన్నారు. సీఎంగా నేను చేసిన అభివృద్ధి తప్ప పీలేరులో ఆయన చేసిందేమీ లేదు. అక్రమాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని