logo

వైకాపా అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన

నగదు పంచుతున్న వారిని అడ్డుకోవాలని చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదుట వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

Published : 06 May 2024 04:40 IST

చిత్తూరు వన్‌టౌన్‌ స్టేషన్‌ ముందు నిరసన తెలుపుతున్న వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి

చిత్తూరు (నేరవార్తలు, జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: నగదు పంచుతున్న వారిని అడ్డుకోవాలని చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదుట వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆయన మాట్లాడుతూ తెదేపా నాయకులు నగదు పంచుతున్నారని, స్వయంగా తామే పట్టించినా పోలీసులు వదిలేస్తున్నారన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ నిరసన తెలిపారు. తెదేపా నాయకులు బెంగళూరు, అనంతపురం జిల్లాల నుంచి మనుషులను రప్పించారని, వారిని పంపేయాలన్నారు. చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్సై షేక్‌షావళి ఆయనకు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. మరోవైపు వైకాపా నాయకుల సూచనలతో పోలీసులు.. తెదేపా కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ అనుచరులు బస చేస్తున్న భరత్‌నగర్‌లోని ఇంట్లో నగదు ఉందంటూ తనిఖీలు చేశారు. అక్కడ ఏమీ లేకపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. వైకాపాకు చెందిన వారు అక్కడే ఉండటంతో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరూ తగ్గకపోవడంతో కొద్దిసేపు వాదించుకుని వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని