logo

యువకుడిపై బాలుడు కత్తితో దాడి

మండల పరిధి బ్రాహ్మణపల్లెకి చెందిన ఓబాలుడు(14) తల్లితో పాటు తిరుపతిలో ఉంటూ జులాయిగా తిరిగేవాడు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన విజయకుమార్‌(24) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.

Published : 08 May 2024 05:34 IST

వెదురుకుప్పం: మండల పరిధి బ్రాహ్మణపల్లెకి చెందిన ఓబాలుడు(14) తల్లితో పాటు తిరుపతిలో ఉంటూ జులాయిగా తిరిగేవాడు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన విజయకుమార్‌(24) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఒకే వీధిలో ఉంటున్న ఈ ఇరువురు స్నేహితులు. ఓ యువతితో ఉన్న సాన్నిహిత్యం వారి మధ్య తగవుకు కారణమైందని, గతంలో వారి మధ్య రాజీ కుదర్చడానికి గ్రామ పెద్దలు సైతం ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బాలుడి తల్లితో.. ఆ యువకుడు విజయకుమార్‌ తన లావాదేవీల గురించి మాట్లాడుతుండగా, బాలుడు తన వద్ద ఉన్న కత్తితో యువకుడిపై దాడి చేసి గాయపరిచాడని, వెంటనే అతడిని చితకబాది పోలీసులకు అప్పగించామని గ్రామస్థులు తెలిపారు. గాయపడిన యువకుడిని తిరుపతి రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు