logo

వైకాపా దోచుకుంది.. తెదేపాకు మద్దతివ్వండి

వైకాపా ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Published : 08 May 2024 06:04 IST

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి

కుప్పం, న్యూస్‌టుడే: వైకాపా ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శాంతిపురం మండలంలోని అనికెర, చెంగుబళ్ల, కెనమాకులపల్లె పంచాయతీల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. పార్టీ శ్రేణులు, మహిళల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. ఆమె ప్రసంగిస్తూ వైకాపా అరాచక, అసమర్ధ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. సీఎం జగన్‌తో పాటు వైకాపా నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక, కల్తీమద్యం, గంజాయి, గ్రానైట్‌, మట్టి దోపిడీతో జేబులు నింపుకున్నారని విమర్శించారు. అధికార పార్టీ దుర్మార్గాలను ప్రశ్నించిన తెదేపా నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు, దాడులు, హత్యలకు తెగబడ్డారని తెలిపారు. నిత్యావసర ధరల భారంతో నలిగిపోతున్న ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా అణచివేత చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవడం అలవాటుగా మలుచుకున్న జగన్‌ ప్రజల భూములను కాజేసేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. వైకాపా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై పోరాడుతున్న చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆలోచించి.. ఎన్నికల్లో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. నారా భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు రామక్రిష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నం, సురేష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు