logo

పోలింగ్‌ కేంద్రాల్ని అప్పగించాలి

పోలింగ్‌ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్‌ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

Published : 10 May 2024 03:24 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్‌ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని.. 12, 13 తేదీల్లో పాఠశాలల్లో వాచ్‌మెన్లు, ఆయాలు అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైనచోట్ల మైక్‌సెట్‌ అందుబాటులో ఉంచాలని, సమస్యలు పరిశీలించి పరిష్కరించుకోవాలన్నారు. జేసీ శ్రీనివాసులు, డీఈవో దేవరాజులు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

  • ఈ నెల 12, 13 తేదీల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు పత్రికల్లో ఇచ్చే ప్రకటనలపై ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ షన్మోహన్‌ పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు