logo

ప్రభల తీర్థాలకు వేళాయే..

సంక్రాంతిలో కనుమరోజు జరిగే ప్రభల ఉత్సవాలకు గ్రామాల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల్లో రాష్ట్రంలో ఎత్తయిన ప్రభలను రూపొందిస్తున్నారు. ఇక్కడి ఏకాదశరుద్రులను ఒకే పర్యాయం దర్శించుకునేందుకు దేశంలోని

Published : 15 Jan 2022 03:06 IST

వాకలగరువులో ప్రభ తయారీలో యువకులు

న్యూస్‌టుడే, అంబాజీపేట సంక్రాంతిలో కనుమరోజు జరిగే ప్రభల ఉత్సవాలకు గ్రామాల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల్లో రాష్ట్రంలో ఎత్తయిన ప్రభలను రూపొందిస్తున్నారు. ఇక్కడి ఏకాదశరుద్రులను ఒకే పర్యాయం దర్శించుకునేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఇప్పటికే ఏడెకరాల కొబ్బరితోటను శుభ్రం చేయించారు. తీర్థానికి భక్తులు వచ్చేందుకు అనువుగా రహదారులను తీర్చిదిద్దారు. ఆయా గ్రామాల్లో ప్రభలను సిద్ధం చేస్తున్నారు.  
అంతా ఐక్యంగా.. 
తీర్థాలకు తీసుకొచ్చే ప్రభల తయారీలో గ్రామస్థులు అందరూ  ఐక్యతతో నిలిచి అందమైన రుద్రప్రభలను రూపొందిస్తారు. ఇందుకోసం నియమ నిష్ఠలతో ఉంటారు. ఒక ప్రభను తయారు చేయాలంటే 10 నుంచి 100 మంది వరకూ పని చేయాల్సి ఉంటుంది. వాటిని  భుజాలపై మోయాలంటే 150 నుంచి 200 మంది యువకులు క్రమశిక్షణతో నడుంకట్టాలి. తాటిచెట్టు పట్టెలతో ప్రభ శూలం నిర్మిస్తారు. దీనికి టేకు బల్ల అమర్చుతారు. మర్రికర్రతో చేసిన అయిదు కాళ్లు వీటికి ఏర్పాటు చేస్తారు. ఒక ప్రభను తీర్చిదిద్దడానికి రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుఅవుతుంది. 20 నుంచి 43 అడుగుల పొడవు, 10 నుంచి 20 అడుగుల వెడల్పులో ఈ ఆధ్యాత్మిక సంక్రాంతి ప్రభలు ఉంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని