logo

మా కష్టాలు తీర్చవా స్వామీ!

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. వసతులు కల్పించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని ఏడు వారాలు దర్శించుకోవడంతోపాటు ప్రతి వారం ఏడేసి ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు తీరుతాయి అన్న నమ్మకంతో

Published : 03 Oct 2022 05:47 IST

బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నా పూర్తికాని పనులు


మాడ వీధుల్లో చిత్తడిలోనే భక్తుల ప్రదక్షిణలు

న్యూస్‌టుడే, ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. వసతులు కల్పించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని ఏడు వారాలు దర్శించుకోవడంతోపాటు ప్రతి వారం ఏడేసి ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు తీరుతాయి అన్న నమ్మకంతో వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ ఆలయంలో అడుగడుగునా సమస్యలే. ఈనెల 14 నుంచి 22 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయినా పనులు పూర్తికాని పరిస్థితి. లోపల క్యూలైన్లు సమస్య పరిష్కారం కాలేదు. ప్రదక్షిణలు చేసే మాడ వీధులు వర్షం వస్తే చిత్తడితో అవస్థలే. రహదారిని అభివృద్ధి చేసేలా చొరవ చూపడం లేదు. పాదరక్షలు భద్రపరచుకునేందుకు సౌకర్యం లేదు. కొందరు భక్తులు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె లేదు. ఇక్కడే పాదరక్షలు విడుస్తున్నారు. ఆలయం ఈశాన్య ప్రదేశంలో స్వామివారికి దీపారాధన చేస్తూ ఉంటారు. అక్కడ వర్షం వస్తే ఇబ్బందే. గోశాల తొలగించిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అక్కడ వసతుల్లేవు. మాడ వీధుల్లోకి ఒక్కోసారి వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అన్నప్రసాదానికి కూడా అవస్థలే. ప్రధాన ఆలయం వద్ద కూర, పచ్చడితో ఇచ్చే ప్లేటు అన్నదాన సదనంకు వెళ్లి అన్నం వడ్డించుకోవాలి. ఈ సమయంలో వర్షం వస్తే అవస్థే. కొద్దిపాటి సమయం విశ్రమిద్దామంటే వీలులేని పరిస్థితి. విశ్రాంతి గదులు లేవు. ఇక స్వామివారి రథం భద్రపరిచేందుకు షెడ్డు లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వసతుల కల్పనపై దృష్టిసారించాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై ఈవో ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని