logo

యాగశాల క్రతువులో సిరివెన్నెల తనయుడు

సీతానగరం మండలం శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానంలో సోమవారం ఉదయం యాగశాల నిర్మాణానికి సినీగేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మ విచ్చేసి భూమిపూజలో పాల్గొన్నారు.

Published : 16 Apr 2024 03:58 IST

సీతానగరం: సీతానగరం మండలం శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానంలో సోమవారం ఉదయం యాగశాల నిర్మాణానికి సినీగేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మ విచ్చేసి భూమిపూజలో పాల్గొన్నారు. జీలకర్రగూడెంకు చెందిన శ్రీరాఘవరాజు వెంకటరామకృష్ణంరాజు (చిన్నబాబు) ఈ క్రతువుకు శ్రీకారం చుట్టారు. యోగీశ్వరశర్మ మాట్లాడుతూ.. గోదావరి తీరప్రాంతంలో నిత్యాన్నదాన కార్యక్రమాలతోపాటు 400కు పైగా గోవులతో పాలకడలి అనే గోశాల ఉన్నచోట ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యాగశాలను తీసుకురావడంతో ఈ ప్రాంతం శోభాయమానంగా విరాజిల్లుతుందన్నారు. వేము వెంకటశివకుమార్‌శర్మ ఆధ్వర్యంలో రుత్విక్కుల మంత్రోచ్ఛరణలతో క్రతువు పూరైంది. సంస్థానం నిర్వాహకులు జగ్గబాబు అన్నసమారాధన చేశారు. కార్యక్రమంలో పల్లేటి సూర్యనారాయణ, పెందుర్తి అచ్చుతరామారావు, వేదవ్యాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని