logo

నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు వీరే..

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Published : 17 Apr 2024 06:17 IST

ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా

అమలాపురం కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. వీరంతా ఇప్పటికే విధుల్లో చేరి ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. రిటర్నింగ్‌ అధికారులే అసెంబ్లీ అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు.

లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హిమాన్షుశుక్లా రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టరేట్‌ కార్యాలయంలోనే నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు.

ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు వెల్లువ..

ఈ సంవత్సరం జనవరి 22న తుది ఓటరు జాబితా విడుదల చేసిన తరువాత నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు కొత్త ఓట్లు నమోదు, మార్పులు చేర్పులకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జనవరి 22 నుంచి ఈ నెల 15 వరకు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల పరిధిలో 27,237 మంది ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 17,800 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి వారికి ఓటు హక్కు కల్పించారు. వివిధ కారణాల వల్ల 5,935 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 3,496 దరఖాస్తులను పరిశీలన చేయాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని ఈనెల 25 లోగా పూర్తి అర్హులైన వారందిరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. వీరి ఓట్లు అనుబంధ జాబితా రూపంలో ప్రచురించడం జరుగుతుందన్నారు. వీరందరూ మే నెలలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని