logo

వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!

వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు.

Published : 20 Apr 2024 03:00 IST

వాలంటీర్‌ రాంబాబు స్టేటస్‌గా పెట్టుకున్న చిత్రం

సీతానగరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. సీతానగరం మండలంలోని 20 సచివాలయాల్లో 341 మంది వాలంటీర్లు పనిచేస్తుంటే ఇప్పటివరకు 231 మంది రాజీనామా పత్రాలను అధికారులకు అందించారు. చినకొండేపూడి సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న రాంబాబు ప్రతిరోజు లబ్ధిదారులకు వైకాపా ప్రచారాస్త్రాలను పంపిస్తూ.. విస్తృతమైన ప్రచారానికి దిగారు. కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల్లోని వైకాపాకు సంబంధించిన ఎన్నికల ప్రచారంతోపాటు సీఎం సిద్ధం సభ తదితర కార్యక్రమాలన్నీ వాట్సాప్‌ స్టేటస్‌లద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని