logo

ప్రశాంతంగా హోం ఓటింగ్

మండలంలో హోం ఓటింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. రెండు బృందాల పర్యవేక్షణలో అధికారులు ఇంటింటికి వెళ్లి జాబితాలో నమోదైన ఓటర్లు ఓటు వేసేలా చర్యలు చేపట్టారు.

Published : 02 May 2024 14:05 IST

తాళ్లపూడి: మండలంలో హోం ఓటింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. రెండు బృందాల పర్యవేక్షణలో అధికారులు ఇంటింటికి వెళ్లి జాబితాలో నమోదైన ఓటర్లు ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. పీవో శ్రీధర్, భారతి, సహాయకులు కిషోర్, దీపక్, సెక్టార్ అధికారులు రుచిత, సూర్ఖాన్, మెక్రో అబ్జవర్, వీడియోగ్రాఫర్ ఆధ్వర్యంలో దివ్యాంగులు, మంచంమీద లేవలేనివారు 31 మంది ఓటు వేశారు. బ్యాలెట్‌ నమూనాలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య ఈ ఓటింగ్ జరిగింది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల ఏజెంట్లుగా వ్యవహరించారు. బ్యాలెట్‌ బాక్సు కొవ్వూరు ఆర్వో కార్యాలయానికి చేరుతుందని, అక్కడి నుంచి లెక్కింపు కేంద్రానికి వెళ్తుందని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు