logo

పెద్దాపురంలో కడప రౌడీలు

ఓటమి భయంతో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలింగ్‌ ముందు, ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించడానికి కడప నుంచి రౌడీలను రప్పించారని, వారతా వివిధ లాడ్జీల్లో బస చేశారని హోం శాఖ మాజీ మంత్రి, తెదేపా,

Published : 07 May 2024 04:16 IST

పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్న కూటమి అభ్యర్థి చినరాజప్ప

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటమి భయంతో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలింగ్‌ ముందు, ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించడానికి కడప నుంచి రౌడీలను రప్పించారని, వారతా వివిధ లాడ్జీల్లో బస చేశారని హోం శాఖ మాజీ మంత్రి, తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కడప నుంచి డబ్బు సంచులతో వచ్చారని, వీరి కదలికలపై నిఘాపెట్టాలని కోరుతూ పోలీసులు, ఎన్నికల కమిషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని ఆనూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు రౌడీలు వెళ్లనున్నారనే సమాచారంతో రెండు రోజుల క్రితమే తాను ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదన్నారు. అటువంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నారని, కడప నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నారని చినరాజప్ప చెప్పారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు మరోమారు ఫిర్యాదు చేస్తానన్నారు. డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి ఏకపక్షంగా ముఖË్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా చేశారని, తెదేపా అధినేత చంద్రబాబును జైలులో వేయడంతో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. డీజీపీ ధోరణిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడంతో అతనిపై బదిలీ వేటు పడిందని చినరాజప్ప చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని