logo

బ్యాలట్‌ ఓటింగ్‌ సమాచార లోపంపై ఉద్యోగుల ఆగ్రహం

గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో రెండో రోజు మంగళవారం కూడా ఆర్వో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే నియోజకవర్గంలో ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ బాలిక గురుకుల పాఠశాలలో పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు.

Published : 08 May 2024 06:30 IST

ఆర్వో కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న ఉద్యోగులు

గోపాలపురం, న్యూస్‌టుడే: గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో రెండో రోజు మంగళవారం కూడా ఆర్వో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే నియోజకవర్గంలో ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ బాలిక గురుకుల పాఠశాలలో పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో పని చేస్తున్న ఇతర నియోజకవర్గాల ఉద్యోగులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఇక్కడే ఓటింగ్‌ ఉంటుందని భావించిన ఉద్యోగులు రాగా అక్కడ ఎటువంటి ఏర్పాటు లేకపోవడంతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. కేవలం గోపాలపురం నియోజకవర్గంలోని ఓట్లరు మాత్రమే పోస్టల్‌ ఓటు వేయడానికి ఏర్పాటు చేసినట్లు అధికారులు బదులిచ్చారు. మిగిలినవారు వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లి ఓటు వేయాలని సూచించారు. నిన్న ఇక్కడ అన్నారు.. ఇప్పుడు మరెక్కడో అంటున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఓటు ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. కొద్దిసేపు కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఆర్వో లక్ష్మీశివజ్యోతి చరవాణిలో మాట్లాడి ఉద్యోగులను శాంతిపజేశారు. ఈ గందరగోళం మధ్య ఉదయం ప్రారంభం కావాల్సిన ఓటింగ్‌ మధ్యాహ్నం వరకు జరగలేదు. వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని