logo

తెదేపా తెచ్చిపెడితే.. వైకాపా వదిలేసింది

నియోజకవర్గకేంద్రమైన పి.గన్నవరం అంబేడ్కర్‌ కాలనీలో తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన సామాజిక నైపుణ్య శిక్షణ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Published : 09 May 2024 04:47 IST

పి.గన్నవరం అంబేడ్కర్‌ కాలనీలో అసంపూర్తిగా భవనం

పి.గన్నవరం, న్యూస్‌టుడే: నియోజకవర్గకేంద్రమైన పి.గన్నవరం అంబేడ్కర్‌ కాలనీలో తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన సామాజిక నైపుణ్య శిక్షణ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. 2018లో గెయిల్‌ నిధులు రూ.50లక్షలతో దీని నిర్మాణ పనులు మొదలు పెట్టారు. భవన నిర్మాణ పనులు 70శాతం పూర్తయ్యాయి. మొత్తం భవన నిర్మాణం పూర్తిచేయటంతోపాటు, చుట్టూ ప్రహరీ  నిర్మాణానికి మరో రూ.30లక్షల నిధులు కావాలి. అప్పటి తెదేపా ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి దీనిని మంజూరు చేయించారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భవనం గురించి పట్టించుకోలేదు. కనీసం భవనంవైపు కూడా వైకాపా ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. అలా కాలగర్భంలో అయిదేళ్లు కరిగిపోయాయి తప్ప మిగిలిన రూ.30లక్షల నిధులు మంజూరు కాలేదు. ఈ భవనం పూర్తిచేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ యువతకు దీంట్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు తద్వారా వారికి ఉపాధి కల్పించాలనేది దీని ఉద్ధేశం. అంతటి మంచి లక్ష్యంతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తిచేయకుండా వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీన్నిబట్టే తెలుస్తోంది.. ఎస్సీలపై జగన్‌కు ఎంత ప్రేమ ఉందోనని స్థానికులు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని