logo

ఓట్ల కోసం నోట్ల వల

తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఇప్పటివరకు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెడుతూ వచ్చారు.

Published : 09 May 2024 04:59 IST

డబ్బు పంపిణీకి వైకాపా సిద్ధం

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం, కంబాల చెరువు: తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఇప్పటివరకు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెడుతూ వచ్చారు. ముందస్తు వ్యూహరచన మేరకు ఇప్పటికే ఆయా డివిజన్లలో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేయడంతో పాటు వివిధ వర్గాల వారికి, కులసంఘాల నాయకులకు తాయిలాలు అందించారు. ఆత్మీయ సమావేశాల పేరిట వివిధ కులసంఘాలతో సమావేశాలు నిర్వహించి విందు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు.

పోలింగ్‌ దగ్గర పడటంతో..

పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో నోట్లతో ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. హోం ఓటర్లను కూడా వదలకుండా ఇటీవల ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసిన వైకాపా నాయకులు ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే ఉద్యోగులను సైతం ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారం.

డివిజన్ల వారీగా..

ఈ నెల 13న ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లందరికీ డివిజన్ల వారీగా డబ్బుల పంపిణీకి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కొక్క ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించగా అవసరమైతే తెదేపాకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెల 12 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి కార్యాలయం నుంచి ఓటర్లకు ఫోన్లుచేసి వివరాలు, అదే చిరునామాలో ఉన్నారా? లేదా? అనేవి తెలుసుకుంటున్నారు.

బుధవారం రాత్రి వరకు హడావుడి: కొన్ని శివారు డివిజన్లలో బుధవారం రాత్రి 11 గంటలు దాటినా డబ్బుల పంపిణీ ఆగలేదు. ఒక్కో వార్డులో పదేసి మంది యువకులు, స్థానిక నాయకులతో కలిసి జల్లెడేసి మరీ రూ.2500-3000 వరకు ఇస్తున్నారు. జాబితాలో పేరు, ఓటరు స్లిప్పు నంబరును పరిశీలించుకుని బహిరంగంగానే డబ్బులు పంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు