logo

ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!

ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది.

Published : 10 May 2024 05:10 IST

న్యూస్‌టుడే, మండపేట: ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. తమ ఇంట్లో ఓట్లు అమ్ముకోబోమని, ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ రాసిన ఫ్లెక్సీని గోడపై అతికించారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ పాఠకురాలైన ఆమె ఓటుహక్కు వినియోగంపై అవగాహన కలిగి ఉన్నారు. తన జీవిత కాలంలో అనేకసార్లు ఓటు హక్కు వినియోగించుకున్నానని, ఏనాడూ ప్రలోభాలకు గురికాలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు