logo

చట్టాలపై ప్రజలకు అవగాహన

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేందుకు చట్టాలపై అవగాహన కల్పించేలా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ వైవీఎస్‌బీజీ పార్థసారథి తెలిపారు.

Published : 29 Jan 2023 06:03 IST

ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి, జేసీ రాజకుమారి తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేందుకు చట్టాలపై అవగాహన కల్పించేలా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ వైవీఎస్‌బీజీ పార్థసారథి తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో శనివారం న్యూ మాడ్యూల్‌ లీగల్‌ సర్వీస్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచిత న్యాయ సేవలతో పాటు, అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలను ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో అందించే లక్ష్యంతో సంస్థ పని చేస్తుందన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ సరకుల ధరలు నియంత్రించడంతో పాటు, నిరుపేదలకు రాయితీతో ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామ్‌గోపాల్‌ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత, సత్వర న్యాయం, చట్టాలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సంస్థ పని చేస్తుందన్నారు. సంస్థ కార్యదర్శి రత్నకుమార్‌ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన పథకాలు సమర్థంగా అమలు చేయడం, చిన్నారులకు న్యాయ సేవల పథకం అంశాలపై సంస్థ అవగాహన శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం బ్యాంకు లింకేజీ ద్వారా 11,941 డ్వాక్రా సంఘాలకు రూ.609.24 కోట్లను, స్త్రీ నిధి ద్వారా 17,167 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.67.98 కోట్ల చెక్కులను అందించారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు, వీల్‌ ఛైర్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, విభిన్న ప్రతిభావంతుల ఏడీ సువార్త, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని