logo

ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి బాలుడికి గాయాలు

ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో విద్యుత్తు వైర్లు షార్ట్‌ సర్క్యూటై గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యనగర్‌కు చెందిన బాలుడు జితేంద్ర ఆడు కునేందుకు ఎన్టీఆర్‌ కాలనీకి వెళ్లాడు.

Updated : 23 Mar 2023 05:42 IST

గాయాలైన జితేంద్ర

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో విద్యుత్తు వైర్లు షార్ట్‌ సర్క్యూటై గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యనగర్‌కు చెందిన బాలుడు జితేంద్ర ఆడు కునేందుకు ఎన్టీఆర్‌ కాలనీకి వెళ్లాడు. అక్కడ ఓ ఇంటి వద్ద ఆడుకుంటూ మెట్లు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలాడు. దీంతో విద్యుత్తు వైర్లు షార్ట్‌ సర్క్యూటై జితేంద్ర పొట్ట, కుడి చేయి కాలింది. తండ్రి జగదీష్‌తో పాటు స్థానికులు వెంటనే ప్రభుత్వా సుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని