logo

వందేభారత్‌ వచ్చింది

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం రాత్రి గుంటూరు వచ్చింది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి నేరుగా గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లింది.

Published : 01 Apr 2023 05:38 IST

ప్రయోగాత్మక పరిశీలనలో గుంటూరు మీదగా ప్రయాణించిన రైలు

స్టేషన్‌కు చేరిన నూతన రైలు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం రాత్రి గుంటూరు వచ్చింది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి నేరుగా గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. 16 బోగీలతో వచ్చిన ఆ రైలును స్టేషన్‌లోని ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించారు. మిగిలిన రైళ్ల కన్నా భిన్నంగా అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉంది. మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. 52 మంది కూర్చొనే మొదటి శ్రేణి బోగీలు రెండున్నాయి. మిగిలిన 14 కోచ్‌ల్లో 1,024 మంది ప్రయాణించవచ్చు. కోచ్‌ పొడవు 23 మీటర్లు, ప్రత్యేకంగా స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందితో మాట్లాడేందుకు అలారం బటన్‌, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.

9 నుంచి అందుబాటులోకి... ఏప్రిల్‌ 9వ తేదీన తిరుపతి నుంచి, 10వ తేదీన సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు 3.45 గంటల్లో, తిరుపతికి 8.30 గంటల్లో చేరనుంది. మంగళవారం మినహా రోజూ తిరుగుతోంది. ఉదయం సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మధ్యాహ్నం తిరుపతి చేరుతుంది. అక్కడి నుంచి 45 నిమిషాల వ్యవధిలో తిరిగి బయల్దేరుతుంది. రాత్రి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఏప్రిల్‌ 8వ తేదీన సికింద్రాబాద్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభిస్తున్నప్పటికీ ఆరోజు ప్రయాణికులను అనుమతించరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని