NDA: సీఎస్‌, డీజీపీని బదిలీ చేయాలి: ఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైకాపా ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్డీయే కూటమి నేతలు ఆరోపించారు.

Published : 16 Apr 2024 16:38 IST

దిల్లీ: అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైకాపా ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్డీయే కూటమి నేతలు ఆరోపించారు. ఈమేరకు కనక మేడల రవీంద్రకుమార్‌ (తెదేపా) నాదెండ్ల మనోహర్‌ (జనసేన), జీవీఎల్‌ నరసింహారావు (భాజపా) తదితరులు దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ని కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...‘‘ ప్రతిపక్ష నేతలను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరాం. సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌ల్లో వీడియో రికార్డింగ్‌ చేపట్టాలి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ తదితరులను బదిలీ చేయాలని కోరాం. వివేక్‌ యాదవ్‌, ధర్మారెడ్డి, రఘురామిరెడ్డిపై కూడా ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని