logo

గుంటూరువాసికి క్రికెట్‌ సైట్‌ స్క్రీన్‌పై పేటెంట్‌

జోసెల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్‌, ఉమెన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్‌ అకాడమీ పూర్వ ఛైర్మన్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ నూతన ఆవిష్కరణకు పేటెంట్‌ లభించింది.

Published : 18 Apr 2024 05:33 IST

పేటెంట్‌ దక్కిన సైట్‌  స్క్రీన్‌ నమూనా

ఎస్వీఎన్‌కాలనీ (గుంటూరు), న్యూస్‌టుడే: జోసెల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్‌, ఉమెన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్‌ అకాడమీ పూర్వ ఛైర్మన్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ నూతన ఆవిష్కరణకు పేటెంట్‌ లభించింది. కోల్‌కతాకు చెందిన భారత ప్రభుత్వ పేటెంట్‌ కార్యాలయం ఈ మేరకు ధ్రువీకరణ పత్రం అందించింది. దీనికి సంబంధించిన వివరాలను గుంటూరులో పూర్వ క్రికెట్‌ క్రీడాకారుడు మురళీమోహన్‌ బుధవారం మీడియాకు వివరించారు. క్రికెట్‌ ఆటలో పిచ్‌కు ఇరువైపులా బ్యాటర్‌, బౌలర్ల దృష్టి మరలకుండా ఉండేందుకు రెండు పెద్ద తెర(సైట్‌ స్క్రీన్‌)లు ఉంచుతారు. వాటికి నలుపు, తెలుపు రంగుల వస్త్రాలు ఉపయోగిస్తారు. వాటిని తయారు చేయడం, వినియోగించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. తుపాను, గాలివానలు వచ్చినపుడు పాడైపోయేవి. దీనికి సంబంధించి మురళీమోహన్‌ అతి తక్కువ ఖర్చుతో చాలా తేలికగా నలుపు, తెలుపు రంగులు మారేలా ఖనిజంతో సైట్‌ స్క్రీన్‌ను తయారుచేశారు. గాలి వెళ్లేలా.. తుపానుల్లో పడిపోని విధంగా దీనిని తయారు చేశారు. చాలా సులభంగా పిచ్‌కు ఎదురుగా, బ్యాటర్‌కు అనుకూలంగా సైట్‌ స్క్రీన్‌ను జరుపుకోవచ్చు. ఈ నూతన ఆవిష్కరణకు 20 ఏళ్ల పాటు మురళీమోహన్‌కు పేటెంట్‌ లభించింది. ఇది క్రికెట్‌ క్రీడకు చాలా ఉపయోగపడుతుంది. మురళీమోహన్‌ తండ్రి జాగర్లమూడి చంద్రమౌళి ఏసీఏకు అధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు గుంటూరు క్రికెట్‌ క్లబ్‌ను స్థాపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని