logo

తాగునీరివ్వకపోతే బతికేదెలా..?

తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్‌ నగర్‌ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Published : 20 Apr 2024 05:07 IST

రోడ్డుపై బైఠాయించి మహిళలు, చిన్నారుల నిరసన
ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్‌ నగర్‌ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం చెరువులోకి నీరు వచ్చాయి. ఈ క్రమంలో నీటిని కుళాయిలకు పంచాయతీ అధికారులు సరఫరా చేస్తున్నారు. తమకు అరగంట కూడా సరఫరా చేయడం లేదని ఖాళీ బిందెలు, చిన్నపిల్లలతో మహిళలు సాయంత్రం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే మార్గంలో కాకుమానులో కూటమి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మహిళలతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. స్నానాలు చేయడానికి, వాడుకునేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సోమేశ్వరరావు చేరుకుని వారిని నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు. సమస్య పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి జాన్‌పీˆరా హామీతో ఆందోళన సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని