logo

బ్యాలెట్‌ ఓట్లకు బేరసారాలు

ఒకటి కాదు.. రెండు కాదు.. పది ముఠాలు పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో కాచుక్కున్నాయ్‌... ఓటేసేందుకు వచ్చిన ఉద్యోగితో బేరసారాలాడటం..

Published : 06 May 2024 04:51 IST

వినుకొండ: ఒకటి కాదు.. రెండు కాదు.. పది ముఠాలు పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో కాచుక్కున్నాయ్‌... ఓటేసేందుకు వచ్చిన ఉద్యోగితో బేరసారాలాడటం.. అంగీకరించిన వారి చేతిలో కరెన్సీ నోట్లు పెట్టడం వంటి దృశ్యాలు ఆదివారం తొలిరోజు ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సందర్భంగా ఆదివారం లొయోల ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద కనిపించాయి.   అధికార వైకాపా ఉద్యోగులపై ఒత్తిళ్లు తెచ్చింది. నియోజకవర్గంలో 2300 పోస్టల్‌ బ్యాలెట్‌లు ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు వారిని ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మాట వినని వారిపై బంధువులను ప్రయోగించారు. వారం నుంచే బేరసారాలు మొదలు పెట్టారు. ఓటు రూ.3 వేల వంతున పంచారు. కొందరు మాత్రం డబ్బులు తీసుకునేందుకు నిరాకరించగా అధిక శాతం ప్రలోభాలకు లొంగినట్లు తెలిసింది. గుంటూరులో పని చేస్తున్న ఓ ఉద్యోగి బంధువొకరు డబ్బుల కోసం ఫోన్‌ చేసి అడగటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని