logo

మాటల్లోనే సురక్షితం.. గ్రామాలకు అందని జలం

రొంపిచర్ల మండలంలోని మునమాకలో నాలుగేళ్ల నుంచి రక్షిత మంచి నీటి పథకం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

Published : 06 May 2024 04:53 IST

పనిచేయని మునమాక నీటి ట్యాంకు

రొంపిచర్ల మండలంలోని మునమాకలో నాలుగేళ్ల నుంచి రక్షిత మంచి నీటి పథకం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని పాలకులు చెప్పినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మండల పరిధిలో రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా అవి సక్రమంగా పనిచేసే గ్రామం ఒక్కటీ లేదు. రూ.కోట్లు వెచ్చించి తాగునీటి పథకాలు అందుబాటులోకి తెచ్చినా కొన్నిచోట్ల అవి ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అలంకారప్రాయంగా మారాయి. ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

న్యూస్‌టుడే, నరసరావుపేట వ్యవసాయం

రొంపిచర్ల మండలంలో తాగునీటి చెరువు ఇలా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని