logo

అక్రమ వసూళ్లలో రజిని ఆల్‌టైం రికార్డు

అయిదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలందరూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 06 May 2024 04:56 IST

మైనింగ్‌తో రూ.వేల కోట్లు వెనకేసుకున్న రోశయ్య
తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని

మాట్లాడుతున్న చంద్రశేఖర్‌, వేదికపై నాయకులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: అయిదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలందరూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ1 కన్వెన్షన్‌లో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ ‘చిలకలూరిపేట నుంచి ఇక్కడకు వచ్చిన రజిని అక్రమ వసూళ్లలో ఆల్‌టైం రికార్డు సృష్టించిన ఘనత సొంతం చేసుకున్నారు. కిలారి రోశయ్య అక్రమ మైనింగ్‌తో రూ.వేల కోట్లు వెనకేసుకున్నారు. దళితులకు చెందిన 400 ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి అప్పగించినందుకు రజినికి మంత్రి పదవి వచ్చింది. రోశయ్య 700 ఎకరాల్లో అక్రమ గ్రావెల్‌ తవ్వి అవినీతి సంపాదనకు పాల్పడ్డారు. ఈ ఇద్దరూ అవినీతికి పరాకాష్ట. నేను కష్టాలను చూస్తూ పెరిగాను. కష్టపడి చదువుకొని ఈ స్థాయికి ఎదిగాను. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి జీవనం సాగిస్తున్న వడ్డెర్లకు అండగా ఉంటా’.. అని హామీ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ వడ్డెర్లను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని చంద్రబాబు సత్యపాల్‌ కమిటీని నియమిస్తే.. జగన్‌ అధికారంలోకి రాగానే నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు’.. అని విమర్శించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, వడ్డెర సాధికార సమితి కన్వీనర్‌ వడ్డే వెంకట్, చంద్రగిరి బాబు, జాన్‌ సైదా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని