logo

జాతీయ రహదారిపై వంట నూనె మాఫియా

జాతీయ/రాష్ట్రీయ రహదారుల వెంబడి నిర్వహించే అల్పాహారశాలలు, భోజనశాలల్లో ఉపయోగించే నూనె (ఆయిల్‌) సరఫరాలో కల్తీ పెద్దఎత్తున జరుగుతున్నట్లు సమాచారం.

Published : 09 May 2024 06:17 IST

చిన్న కొత్తపల్లి కేంద్రంగా దిగుమతి.. అల్పాహారశాలలే లక్ష్యం

 చిన్నకొత్తపల్లి డొంక వద్ద ఆయిల్‌ దిగుమతి

 అద్దంకి, న్యూస్‌టుడే: జాతీయ/రాష్ట్రీయ రహదారుల వెంబడి నిర్వహించే అల్పాహారశాలలు, భోజనశాలల్లో ఉపయోగించే నూనె (ఆయిల్‌) సరఫరాలో కల్తీ పెద్దఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. ఈ రకం నూనెను కోళ్లకు పౌష్టికాహారం అందించేవారు ఉపయోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ కంటే ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో దీనికి మంచి గిరాకీ ఉంది. గతంలో జాతీయ రహదారులపై డీజిల్‌, పెట్రోలు ఉత్పత్తుల్ని తక్కువ ధరకు విక్రయించేవారు. వాటి స్థానంలో కిరోసిన్‌ను నింపుకొని వాహనాలు నడిచేవి. కిరోసిన్‌ సరఫరా తగ్గడంతో ఈ తరహా వ్యాపారం నిర్వహించేవారు తక్కువ ధరకు నూనెను కొనుగోలు చేయడం, దానిని అల్పాహార/భోజనశాలలకు విక్రయించే పనుల్లో మునిగిపోయారు. నామ్‌ రహదారిపై అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి డొంక కేంద్రంగా కల్తీ నూనె వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని