logo

ఎన్నికల నిర్వహణకు సిద్ధం కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో సమర్థంగా నిర్వహించటానికి అధికారులంతా సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా తెలిపారు.

Published : 09 May 2024 06:23 IST

నోడల్‌ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న రంజిత్‌బాషా

బాపట్ల, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో సమర్థంగా నిర్వహించటానికి అధికారులంతా సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్లో నోడల్‌ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు నగదు, మద్యం, కానుకల పంపిణీని పూర్తిగా అరికట్టాలని చెప్పారు. 12న ఉదయాన్నే ఆయా నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ సిబ్బంది హాజరు కావాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్‌ రోజు వినియోగంలోకి రాని ఈవీఎంలు, రిజర్వ్‌ ఈవీఎంలను పురపాలక ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించి భద్రపరచాలన్నారు. సక్షం యాప్‌లో ముందుగా తమ పేర్లు నమోదు చేసుకున్న దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్‌ రోజున ఇంటి వద్దకు వాహన సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. డీఆర్వో సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని