logo
Updated : 29/11/2021 03:48 IST

డీసీఎం, బైక్‌ ఢీ.. బాలుడి మృతి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఆరేళ్ల కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా డీసీఎం ఢీకొట్టడంతో వాహనం వెనుక కూర్చొన్న బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లోని రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సాంబయ్య కుటుంబంతో కలిసి శుభకార్యంలో పాల్గొనేందుకు బైక్‌ను సీబీఎస్‌లో పెట్టి ములుగు వెళ్లారు. ఆదివారం వేకువజామున తిరిగి వచ్చి వాహనం తీసుకొని కుమారుడితో ఇంటికి బయలుదేరాడు. తెలుగుతల్లి కూడలి దాటుతుండగా మరో మార్గం నుంచి దూసుకొచ్చిన డీసీఎం బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఆరేళ్ల దరావత్‌ మోక్షిత్‌లాల్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా కొద్ది సేపటికే మృతిచెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని