logo
Published : 29/11/2021 01:43 IST

నైపుణ్యం పెంపు, ఉద్యోగ కల్పన లక్ష్యం

ఓయూలో హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

ప్రొ.రవీందర్‌ నుంచి నియామకపత్రం అందుకుంటున్న ప్రొ.స్టివెన్‌సన్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో నైపుణ్య పెంపు కోసం వారికి అన్నిరంగాల్లో మద్దతు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హ్యుమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అందుబాటులోకి రానుంది. ఓయూలోని విద్యార్థుల ఉద్యోగ కల్పన కేంద్రం, విదేశాల్లో ఉన్నత చదువు-ఉద్యోగం కోసం కౌన్సెలింగ్‌, ఫినిషింగ్‌ స్కూల్‌ మూడు విభాగాలను కలిపి హుమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యను పూర్తి చేసి విదేశాల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం యత్నించే విద్యార్థులకు సరైన సమాచారం కేంద్రం ఇప్పటివరకు ఓయూలో లేకపోవడం లోటుగా ఉండేది. దాన్ని భర్తీ చేస్తూ కొత్తగా ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు వివిధ దేశాల్లో విద్య-ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో విదేశాల్లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

భవిష్యత్తులో టోఫెల్‌, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఈ శిక్షణ ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఇప్పటికే ఓయూలోని ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా విభాగంలో వేర్వేరుగా ఉద్యోగ కల్పనను నిర్వహించేవారు. అన్ని విభాగాల ఉద్యోగ కల్పన విభాగాలను ఈ కేంద్రం పరిధిలోకి తీసుకురానున్నారు. ఇక్కడ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలకు కావాల్సిన అన్ని విధాల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఫినిషింగ్‌ స్కూల్‌ ఉపయోగపడనుంది. ఈ కేంద్రానికి సంచాలకుడిగా జర్నలిజం విభాగం అధిపతి ప్రొ.స్టీవెన్‌సన్‌ను ఈనెల 27న నియమించారు. డా.క్రిస్టోఫర్‌, డా.ఎ.ప్యాట్రిక్‌, డా.మురళీధర్‌రెడ్డిలను సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.

విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం: ప్రొ.స్టీవెన్‌సన్‌, కేంద్రం సంచాలకులు

2006లోనే ఫినిషింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని అప్పటి ఉపకులపతి ప్రొ.సులేమాన్‌ సిద్ధికికి వివరించాను. కొన్ని కారణాలతో అప్పుడు ఏర్పాటు కాలేదు. అదే ఆలోచనను ప్రస్తుత ఉపకులపతితో పంచుకున్నాను. దానికి ఉపకులపతి మరింత విస్తృత రూపం ఇచ్చి ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

అన్ని సేవలు ఒక్కచోటే: ప్రొ.రవీందర్‌, ఓయూ ఉపకులపతి

అన్నిరకాల సేవలను ఒకేచోట తీసుకొచ్చి విద్యార్థులకు ఉపయోగపడేలా ఈకేంద్రం ఏర్పాటు చేశాం. కేంద్రం ఏర్పాటుతో పరిశ్రమలకు దగ్గరయ్యే అవకాశముంది. విద్యార్థులకు నైపుణ్య పెంపు, కెరీర్‌ గైడెన్స్‌, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో ఓయూకి ర్యాంకింగ్‌ మెరుగుపరిచేందుకు, న్యాక్‌లో మంచి గ్రేడ్‌ సాధించేందుకు ఈ కేంద్రం ఉపకరిస్తుంది. అంతిమంగా విద్యార్థులకు నైపుణ్యం పెంచి, ఉపాధి కల్పించడమే కేంద్రం లక్ష్యం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని