logo
Published : 01/12/2021 02:21 IST

గోవాలో సైన్స్‌ పండగ.. నగరంలో సందడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో సైన్స్‌ పండగకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ నెల 10 నుంచి 13వ వరకు ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ఈసారి వేడుకలకు గోవా వేదికగా నిలవనుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ, విజ్ఞాన భారతితో కలిసి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గత ఏడాది పూర్తిగా వర్చువల్‌గా నిర్వహించగా.. ఈసారి హైబ్రిడ్‌ విధానంలో చేపట్టబోతున్నారు. నూతన భారత్‌ కోసం 75 కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి కొద్ది రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో కేంద్ర పరిశోధన సంస్థలు విద్యార్థుల్లో అవగాహన కల్పించడంపై దృష్టిపెట్టాయి. ఐఐసీటీ ఇప్పటికే ఐఐసీటీ పాఠశాలలో ఇటీవల ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐ, ఏఆర్‌సీఐ, రక్షణ పరిశోధన సంస్థలు రాబోయే వారంరోజుల్లో వేర్వేరు పద్ధతుల్లో నిర్వహించనున్నాయి. వర్చువల్‌గా పాల్గొనవచ్చు అని ఐఐసీటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని