logo
Published : 02/12/2021 07:27 IST

బిల్లుపై పేరు ఎందుకు రాయలేదు.?

వినియోగదారుడికి రూ.1.55లక్షలు చెల్లించాలంటూ ‘చందన బ్రదర్స్‌ జ్యూయలరీ’కి ఆదేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పేరు లేని ఇన్‌వాయిస్‌ (రసీదు) ఇవ్వడంతో పాటు వినియోగదారుకు ఇవ్వాల్సిన రూ.85 వేలు చెల్లించని ‘చందన బ్రదర్స్‌ జ్యువెలరీ’ చిక్కడపల్లి శాఖపై జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేవల్లో లోపంగా పరిగణిస్తూ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. బంగారు ఆభరణాల ఎక్స్ఛేంజీకి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో మల్కాజిగిరి మారుతీనగర్‌కు చెందిన ఇ.కె.నాగరాజ రామ్‌మోహన్‌.. షోరూమ్‌కి వెళ్లారు. తన వద్ద ఉన్న రూ.1,87,422 విలువైన ఆభరణాలను ఇచ్చేసి.. నాలుగు బంగారు గాజులు కొనుగోలు చేశారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రూ.1,04,000 బిల్లు వేసి మరో రూ.85 వేలు ఇతర పేమెంట్‌ అంటూ రసీదులో పేర్కొన్నారు. అందులో కొనుగోలుదారు పేరు లేదు. బిల్లు చూసిన అనంతరం తనకు రావాల్సిన రూ.85,000 ఇవ్వలేదని గ్రహించి ప్రశ్నించినా లాభం లేకపోయింది. చివరకు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన జిల్లా కమిషన్‌ బెంచ్‌ అధ్యక్షురాలు పి.కస్తూరి, సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు వెలువరించారు. రసీదులో పేరు ఎందుకు రాయలేదంటూ బెంచ్‌ ప్రశ్నించింది. వినియోగదారు వాదనలతో ఏకీభవిస్తూ రూ.50 వేలు పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.5 వేలు, నష్ట పరిహారం రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని