logo

27 నిమిషాల్లో.. 36.8 కిలోమీటర్లు

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఊపిరాగినా.. అవయవదానంతో 73 ఏళ్ల వ్యక్తి ప్రాణాల్ని నిలిపారు. మహరాష్ట్రలోని పుణేకు చెందిన సంగీతా అశోక్‌(51) రోడ్డు ప్రమాదంలో గాయపడగా కుటుంబీకులు ఈనెల 15న డాక్టర్‌ డీవై పాటిల్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌లో చేర్పించారు.

Published : 21 May 2022 01:23 IST

శంషాబాద్‌ నుంచి కిమ్స్‌కు ఊపిరితిత్తుల తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌; రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఊపిరాగినా.. అవయవదానంతో 73 ఏళ్ల వ్యక్తి ప్రాణాల్ని నిలిపారు. మహరాష్ట్రలోని పుణేకు చెందిన సంగీతా అశోక్‌(51) రోడ్డు ప్రమాదంలో గాయపడగా కుటుంబీకులు ఈనెల 15న డాక్టర్‌ డీవై పాటిల్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌లో చేర్పించారు. ఐదు రోజులపాటు వైద్యం అందించిన వైద్యులు జీవన్మృతురాలు అయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న అక్కడి జోనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (జెడ్‌టీసీసీ) వైద్యం బృందం ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 73 ఏళ్ల వ్యక్తి నమూనాలు సరిపోవడంతో ఇక్కడి జీవన్‌దాన్‌కు సమాచారం అందించారు. పుణే నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి అవయవాలను శుక్రవారం ఉదయం తరలించారు. విమానాశ్రయం నుంచి కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 7.28 శంషాబాద్‌ నుంచి బయల్దేరిన అంబులెన్స్‌ బేగంపేటలోని కిమ్స్‌ ఆసుపత్రికి 7.55 గంటలకు చేరింది. 36.8 కి.మీ ల దూరాన్ని 27 నిమిషాల్లో చేర్చినట్లు నగర ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ పేర్కొన్నారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్స పూర్తయినట్లు జీవన్‌దాన్‌ పీఆర్‌వో పవన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని